Srinu vaitla: ఢీ సీక్వెల్‌ శ్రీనువైట్ల ఎందుకు చేయడం లేదో తెలుసా?

Do you know why Srinu vaitla is not doing the sequel
షార్ట్స్‌లో చూడండి

విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్‌ తెరకెక్కించడం అనేది టాలీవుడ్‌లో ఇప్పుడు జోరందుకుంది. కొత్త కథల అన్వేషణ, క్యారెక్టర్స్‌ సృష్టి ఇవన్నీ కష్టతరమైన ఈ తరుణంలో నేటి దర్శకులకు తమ సినిమాలకు సీక్వెల్స్‌ చేయడమనేది మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తుంది. ఇదే కోవలోనే తన దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రానికి అప్పట్లో సీక్వెల్‌ చేద్డామని శ్రీనువైట్ల అనుకున్నారు. మంచు విష్ణు, శ్రీహరి, జెనీలియా, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో  ఘనవిజయం సాధించింది. 

పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిత్రానికి సీక్వెల్‌ చేసే ఆలోచన లేదని శ్రీనువైట్ల అంటున్నారు. 

ఆయన మాట్లాడుతూ... "ఢీ చిత్రంలో నటించిన శ్రీహరి మరణించడం వల్ల నా దృష్టిలో ఆయన పాత్రను ఎవరూ రీప్లేస్ చేయలేరు. అందుకే సీక్వెల్‌ను పక్కన పెట్టేశాను. ఢీ-2 చిత్రంను చేయాలనే ఆలోచన నాకు లేదు. కాకపోతే ఆ చిత్రానికి మించిన వినోదాత్మక చిత్రాలను అందించే ప్రయత్నంలో ఉన్నాను. త్వరలోనే విడుదల కానున్న నా చిత్రం 'విశ్వం'లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరిస్తుంది" అన్నారు. 

అయితే టాలీవుడ్‌లో మాత్రం ఢీ-2 చిత్రాన్ని మంచు విష్ణు మరో దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నారనే వార్త ప్రచారంలో వుంది.
Go Back to Shorts
Srinu vaitla
Dhee
Dhee-2
Tollywood

More Telugu News