సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. కూతురు మృతి

Actor Rajendra Prasad daughter passes away
  • గుండెపోటుతో రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మృతి
  • గాయత్రి వయసు 38 సంవత్సరాలు
  • నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురైన గాయత్రి
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Advertisement
Rajendra Prasad
Tollywood
Daughter

More Telugu News