రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాటన్ మిల్లు ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి
- కల్వకుర్తి స్పిన్నింగ్ మిల్లులో ఎన్నికలు
- కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్‌కేవి గెలుపు
- 450 ఓట్లకు గాను 251 ఓట్లు పొందిన బీఆర్ఎస్‌కేవి అభ్యర్థి
కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 450 ఓట్లకుగాను 439 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్‌కేవీ బలపర్చిన అభ్యర్థి సూర్యప్రకాశ్ రావుకు 251 ఓట్లు రాగా, ఆనంద్ కుమార్‌కు 183 ఓట్లు వచ్చాయి.