లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు... చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్!

Prakash Raj another tweet on Laddu Prasadam
  • శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
  • దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్న కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన ప్రకాశ్ రాజ్
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో ట్వీట్
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేస్తూ 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన క్లిప్పింగ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని అందులో పేర్కొన్నారు.

ల్యాబ్ రిపోర్ట్ సవివరంగా లేదని, అలాంటప్పుడు మీరు నేరుగా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని పేర్కొన్నారు. 
Advertisement
Prakash Raj
Pawan Kalyan
Chandrababu
Tirumala

More Telugu News