తెలంగాణ సీఎంను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం
- బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పవన్ కల్యాణ్
- వరద బాధితుల సహాయం కోసం రూ.కోటి చెక్కు అందజేత
- సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించిన నేతలు
తెలంగాణలోని వరద బాధితులకు ఇటీవల ఆయన రూ. కోటి విరాళం ప్రకటించారు. తాజాగా బుధవారం ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ఇచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం.