నా జీవితంలో రెండు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి: తమన్నా

I have two love failures in my life says Tamannaah
  • టీనేజ్ లో తాను తొలిసారి లవ్ లో పడ్డానన్న తమన్నా
  • ఏదో సాధించాలనే తపనతో ఆ బంధానికి ముగింపు పలికానని వెల్లడి
  • ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇదే సమయంలో ఐటెం సాంగులతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 

తన జీవితంలో రెండు లవ్ ఫెయిల్యూర్లు (హార్ట్ బ్రేక్స్) ఉన్నాయని తమన్నా తెలిపింది. టీనేజ్ లో ఉన్నప్పుడు తాను ప్రేమలో పడ్డానని... అయితే ఆ లవ్ ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పింది. ఆ సమయంలో తాను ఏదో సాధించాలనే తపనతో ఉన్నానని... ఒక వ్యక్తి కోసం తన జీవితాన్ని వదులుకోవాలనిపించలేదని తెలిపింది. ఆ విధంగా తాను తొలి హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని చెప్పింది. 

ఆ తర్వాత తాను మరొక వ్యక్తితో ప్రేమలో పడ్డానని... ఆ ప్రేమ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదని తమన్నా తెలిపింది. ప్రతి విషయానికి అతను అబద్ధం చెప్పేవాడని... దీంతో, ఆ వ్యక్తితో బంధాన్ని తాను కంటిన్యూ చేయలేకపోయానని చెప్పింది. ఆ విధంగా తాను రెండో హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని తెలిపింది. మరోవైపు ప్రస్తుతం తమన్నా యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Tamannaah
Tollywood
Bollywood
Heart Break

More Telugu News