హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని వెల్లడి
- ఆ నియోజకవర్గాల్లో త్వరలో ఉపఎన్నికలు జరుగుతాయని వెల్లడి
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కోర్టు తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- బైపోల్స్ లో గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.