సెప్టెంబర్ 9 తర్వాత ఈ ఐఫోన్ల విక్రయాల నిలిపివేత!
ఈ ఐఫోన్లు నిలిపివేసే అవకాశం..
కొత్త మోడల్ ఫోన్లు మార్కెట్‌లో విడుదలైన తర్వాత విక్రయాలు నిలిపివేయవచ్చని భావిస్తున్న పాత వెర్షన్ ఫోన్ల జాబితాలో ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ఎస్ఈ ఫోన్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు సెప్టెంబర్ 9 ఈవెంట్ తర్వాత కొన్ని యాపిల్ ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచీలు కూడా నిలిపివేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మరో పక్క డిస్కౌంట్లు..
మరోవైపు కొత్త ఐఫోన్‌లు మార్కెట్‌లో విడుదలయ్యాక పాత మోడల్ ఫోన్లపై డిస్కౌంట్ కూడా అందించే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ కొనాలనుకునేవారు కూడా ఈ సమయంలో అలర్ట్‌గా ఉండొచ్చు. గతంలో కొత్త ఐఫోన్లు విడుదల చేసిన ప్రతి సందర్భంలోనూ పాత ఫోన్లపై యాపిల్ కంపెనీ డిస్కౌంట్లు అందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఫోన్ 14 వేరియంట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
కొత్తగా విడుదల కాబోయే ఫోన్లు ఇవే..
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9న విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో నాలుగు కొత్త ఫోన్లు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు కంపెనీ విడుదల చేయనున్న టెక్ కథనాలు పేర్కొంటున్నాయి.