రాజమండ్రిలో మరోసారి భారీ వర్షం
- నగరంలో 8 సెం.మీ. వర్షపాతం నమోదు
- అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు
- లోతట్టు ప్రాంతాల జలమయం
వరదలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఓవైపు సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు ప్రజలను తరలిస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో రాజమండ్రిలోని కంభాల చెరువు, శ్యామల సెంటర్ ముంపులో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఆదెమ్మ దిబ్బ, తుమ్మలోవ, కోర్లమ్మపేట వరదలో చిక్కుకున్నాయి. రాజమండ్రి సబ్ కలెక్టర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.