కవితకు బెయిల్... హుషారుగా కేటీఆర్... వీడియో ఇదిగో
- కవితకు బెయిల్ రావడంతో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
- ఆనందంతో పార్టీ నాయకులను ఆలింగనం చేసుకున్న కేటీఆర్
- నెట్టింట వైరల్‌గా మారిన కేటీఆర్ సంతోషానికి సంబంధించిన వీడియో
కేటీఆర్ సంబరాలు
తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 165 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు.