'ఆహా' తెరపైకి కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ!
- కన్నడలో హిట్ కొట్టిన 'శాకాహారి'
- ప్రధానమైన పాత్రను పోషించిన రంగయన రఘు
- మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- ఈ నెల 24వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే .. హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది.
అది అడవిని ఆనుకుని ఉన్న ఒక కొండ ప్రాంతం. అక్కడ చిన్నపాటి హోటల్ పెట్టుకుని సుబ్బన్న జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒక రోజున తీవ్రంగా గాయపడి తన హోటల్ కి వచ్చిన వ్యక్తికి సుబ్బన్న ఆశ్రయమిస్తాడు. ఆ వ్యక్తి ఒక హత్యచేసి అక్కడికి వచ్చాడనే విషయం తెలిసి సుబ్బన్న కంగారుపడిపోతాడు. అక్కడి నుంచి అతణ్ణి పంపించేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి అక్కడ చనిపోతాడు. ఫలితంగా సుబ్బన్న ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేది కథ.