Ayesha Takia: ఫొటో షేర్ చేసిన నాగార్జున హీరోయిన్ అయేషా టకియా.. ఇంకా షాక్‌లోనే అభిమానులు!

Ayesha Takia Looks Unrecognisable In New Photo Fans SHOCKED
షార్ట్స్‌లో చూడండి
అక్కినేని నాగార్జున ‘సూపర్’ సినిమాతో 2005లో తెలుగు చిత్రసీమకు పరిచయమైన అయేషా టకియా కుర్రకాళ్ల గుండెలను మెలితిప్పేసింది. ఆ తర్వాత తెలుగు తెరకు ఆమె దూరం జరిగినప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఆ సినిమాకు గాను ఆమె ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్‌లో ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. 

కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైన అయేషా తాజాగా సల్మాన్‌ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ ‘వాంటెడ్’తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అయేషా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటోను చూసి అభిమానులు నిర్ఘాంతపోయారు. ఆ ఫొటోలో ఆమె గుర్తుపట్టలేనంతగా ఉంది. నిజానికి ఆమె అయేషా టకియా అంటే ఎవరూ నమ్మనట్టుగా ఉంది. బంగారం రంగు చీర, పింక్ టోన్‌డ్ మేకప్‌తో ఉన్న ఆ ఫొటో చూసి అందరూ షాకయ్యారు. ఆ వెంటనే ఆ ఫొటో వైరల్ అయింది. 

అది చూసి కొందరు ఆమె అయేషా టకియా కాదని కామెంట్ చేశారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని, ఆ తర్వాత కూడా ఆమె కనిపించిందని, కాబట్టి ఈ ఫొటోలో ఉన్నది ఆమె కాకపోవచ్చని కొందరు అభిప్రాయపడితే.. ఇది నిజమైన ఫోటేయేనా? అని మరికొందరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయేషా టకియా సినిమాలను గుర్తు చేసుకున్న అభిమానులు ఆమె నటనను కొనియాడారు. ‘ఆమె నా చిన్నప్పటి క్రష్’ అంటూ రెడిట్ యూజర్ ఒకరు గుర్తు చేసుకున్నారు. ఆమె ఎలా ఉన్నా ఇప్పటికీ తన ఫేవరెటేనని మరో అభిమాని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Ayesha Takia
Super Movie
Tollywood
Bollywood

More Telugu News