రేవంత్ రెడ్డి సర్కారును ప్రశంసించిన బీజేపీ ఎంపీ... ఎందుకంటే?
- ఎక్స్ వేదికగా స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాల కూల్చివేతను అభినందించిన ఎంపీ
- హైడ్రా చర్యను అభినందిస్తున్నానని వెల్లడి
సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినందుకు ఓ బీజేపీ నాయకుడిగా అభినందిస్తున్నానని... ఇది తనకు సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో తప్పు చేస్తే ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. సరస్సులను కాపాడటానికి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా చర్యను తాను అభినందిస్తున్నానన్నారు. దీనిని వారు కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు.