రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన హాలీవుడ్ నటుడు లుకాస్ బ్రావో
- తాను 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశానన్న లుకాస్ బ్రావో
- చరణ్ ఒక అద్భుతమైన నటుడని ప్రశంస
- చరణ్ ఎమోషనల్ ప్రెజెన్స్ ఉత్కంఠభరితంగా ఉంటుందన్న లుకాస్
ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును తెచ్చిన సినిమా మన తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ ఘనతను దక్కించుకుంది. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా, తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.