తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt relieves employees with Telangana nativity
తెలంగాణ స్థానికతతో ఏపీలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో ఏపీకి కేటాయించిన వారిని, వారి సొంత రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఆ మేరకు  తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు వారి స్వరాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ సర్కారు ఈ రిలీవ్ ఆర్డర్స్ జారీ చేసింది.
Go Back to Shorts
Employees
Telangana Nativity
Relieve Orders
AP Govt
Telangana

More Telugu News