Tapsee: నామీద పడకండి... భయంగా ఉంది: ఫొటోగ్రాఫర్లపై తాప్సీ పన్ను అసహనం

Taapsee Pannu loses her cool at the paparazzi
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి తాప్సీ పన్ను ఫొటో గ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మరీ నా మీద పడకండి' అంటూ వారికి సూచించింది. తాప్సీ నటించిన 'ఫిర్ హై హసీన్ దిల్ రూబా' సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ముంబైలో సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. సినిమా పూర్తయ్యాక తాప్సీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆమె ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు.

వారంతా తనకు సమీపానికి రావడంతో ఒకింత అసహనానికి గురైన తాప్సీ, నా మీద పడకండి, అలా దగ్గరగా వస్తే భయంగా ఉందంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత పలువురు ఫొటోగ్రాఫర్లు ఆమెకు సారీ చెప్పారు. ఫొటోగ్రాఫర్లకు బై బై... థ్యాంక్యూ అని చెప్పుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Go Back to Shorts
Tapsee
Tollywood
Cinema
Bollywood

More Telugu News