Allu Arjun: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే... అల్లు అర్జున్ ను ట్రోల్ చేయొద్దు: హైపర్ ఆది
ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వచ్చి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి బాహాటంగా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి మెగా కుటుంబ అభిమానులు, జనసేన మద్దతుదారులు అల్లు అర్జున్ పై భగ్గుమంటున్నారు. దాంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
ఈ నేపథ్యంలో, మెగా ఫ్యామిలీ సన్నిహితుడు హైపర్ ఆది స్పందించారు. 'శివం భజే' చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని, అల్లు అర్జున్ ను ఎవరూ ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేయవద్దని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ను అగౌరవపరిచేలా థంబ్ నెయిల్స్ పెట్టడం మానేయండి... ఇకనుంచైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పండి అని అన్నారు. అల్లు అర్జున్ జాతీయ అవార్డు గ్రహీత అని, ఆయనను గౌరవించాలని సూచించారు.