రోడ్డు ప్రమాదంలో ‘మిస్టర్ తెలంగాణ’ సోహైల్ మృతి
- బైక్ పై వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టిన సోహైల్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ లు గెల్చుకున్న సిద్ధిపేట యువకుడు
సిద్ధిపేట పట్టణానికి చెందిన మహ్మద్ సోహైల్ ప్రముఖ బాడీ బిల్డర్ గా పేరుతెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో జిల్లా, రాష్ట్ర, సౌతిండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే సోహైల్ ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ ను గెల్చుకున్నాడు. చిన్నవయసులోనే టౌన్ కు పేరుతెచ్చిన సోహైల్ చనిపోవడంపై సిద్ధిపేట వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.