కెప్టెన్ స్మిత్ ఆరోగ్యంపై గుడ్‌న్యూస్.. చికిత్సకు బాగా స్పందిస్తున్న పైలట్
- కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితిపై భారత రాయబార కార్యాలయం అప్‌డేట్
- చికిత్సకు స్మిత్ బాగా స్పందిస్తున్నారని వెల్లడి
- ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని ప్రకనటన
- కుటుంబంతో రాయబార కార్యాలయం టచ్‌లో ఉందని వెల్లడి
- యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారత్
ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకుంటున్నారు. చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం శనివారం తెలిపింది.
స్మిత్‌కు ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం మరో పైలట్ స్మిత్‌పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విమానం ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లింది.
తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్మిత్‌కు ప్రాథమిక చికిత్స అందిస్తూ విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా దించారు.
స్మిత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. స్మిత్ సాహసం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని చెప్పారు. దేశమంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని తెలిపారు. స్మిత్ సాహసాన్ని ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రశంసిస్తున్నారు.