Chaiwala: సింగింగ్ చాయ్‌వాలా.. సోషల్ మీడియా న‌యా సంచలనం.. ఇదిగో వీడియో!

Chaiwala Vijaybhai Patel of Surat New Social Media Sensation
షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన డాలీ అనే చాయ్‌వాలా తన ప్రత్యేకమైన చాయ్ తయారీ శైలి, కాస్త వెరైటీ ఫ్యాషన్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదేకోవ‌లో మ‌రో చాయ్‌వాలా తాలూకు వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. టీ క‌లుపుతూ పాట పాడుతున్న సూర‌త్‌కు చెందిన చాయ్‌వాలా విజ‌య్ భాయ్ ప‌టేల్ ఇప్పుడు సోష‌ల్ మీడియా న‌యా సంచ‌ల‌నంగా మారారు.  

ఈయ‌న టీ ప్రియుల‌కు త‌న చాయ్ రుచి చూప‌డ‌మే కాకుండా గాన మాధుర్యంతో అల‌రిస్తున్నారు. ఒక చేత్తో గ‌రిటె ప్ట‌టుకుని టీ క‌లుపుతూ, మ‌రోవైపు మైక్ ప‌ట్టుకుని పాట‌లు పాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని.. విజయ్‌భాయ్ పటేల్‌ను ప్రశంసిస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. 1972లో వచ్చిన‌ 'అమర్ ప్రేమ్' చిత్రంలోని ప్ర‌ముఖ గాయ‌కుడు కిషోర్ కుమార్ ఆల‌పించిన‌ చార్ట్‌బస్టర్ 'చింగారి కోయి భడ్కే' పాట పాడుతూ తన టీ స్టాల్‌లో చాయ్ ప్రిపేర్ చేయ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. 

“సూరత్‌కు చెందిన విజయ్‌భాయ్ పటేల్ చాలా ఏళ్లుగా డుమాస్‌లో టీ స్టాల్‌ నడుపుతున్నాడు. విజయభాయ్ టీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అతని స్వరం మరింత మధురంగా ఉంటుంది. విజయ్‌భాయ్ టీ తాగడానికి, అతని పాటలు వినడానికి చాలా దూరం నుండి ప్రజలు వస్తుంటారు” అని ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఈ వీడియోను పోస్ట్ చేశారు. 

దాంతో ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. సూరత్‌లోని ఈ 'సింగింగ్ చాయ్‌వాలా' వీడియో సోష‌ల్ మీడియాలో పోస్టయిన‌ గంటలోపే 2 లక్షలకు పైగా వ్యూస్ సాధించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.
Go Back to Shorts
Chaiwala
Vijaybhai Patel
Surat
Social Media

More Telugu News