'వందేమాతరం' పాటకు కోహ్లీ, పాండ్యా సహా భారత జట్టు చేసిన పనికి గూస్‌బంప్స్.. ఇదిగో వీడియో!
- వాంఖడేలో భారత ఆటగాళ్లకు ఘన సన్మానం
- వేడుక ముగిసిన తర్వాత టీమిండియా వాంఖడే చుట్టూ దేశభక్తి గీతాలపై ర్యాలీ
- ఆ సమయంలో ఐకానిక్ 'వందేమాతరం' పాట ప్రసారం
- టీమిండియా సభ్యులందరూ ఆ పాటను పాడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన వైనం
అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ, "స్టేడియంలోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ రాత్రి వీధుల్లో చూసింది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను" అని అన్నారు.
ఇక వేడుక ముగిసిన తర్వాత భారత జట్టు వాంఖడే స్టేడియం చుట్టూ దేశభక్తి గీతాలపై ర్యాలీ తీసింది. ఆ సమయంలో ఐకానిక్ 'వందేమాతరం' పాట ప్రసారమైంది. దాంతో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో పాటు టీమిండియా సభ్యులందరూ ఆ పాటను ఆలపించారు. అది చూసిన అభిమానులకు గూస్‌బంప్స్ వచ్చాయి. దీని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.