ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశం పుష్కలం.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే కప్ ఎవరికి ఇస్తారంటే..!
- ఫైనల్ మ్యాచ్‌కు పొంచివున్న వానగండం
- శనివారంతో పాటు రిజర్డ్ డే అయిన ఆదివారం కూడా వర్షం ముప్పు
- మ్యాచ్ రద్దయితే సంయుక్త విజేతలుగా నిలవనున్న భారత్, దక్షిణాఫ్రికా
అయితే శనివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రిజర్వ్ డే అందుబాటులో ఉంది. అంటే ఆదివారం ఇరు జట్లు ఫైనల్ ఆడాల్సి ఉంది. అయితే ఆదివారం కూడా వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ రిపోర్టులు అంచనా వేశాయి. ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? అనే సందేహాలు క్రికెట్ ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా రెండు రోజులు వర్షం పడి మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే ఐసీసీ రూల్స్ ప్రకారం.. భారత్, దక్షిణాఫ్రికా రెండూ సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని ఇరు జట్లు గెలిచినట్టు ప్రకటిస్తారు.