సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్, ఎన్ఎస్‌సీ పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం!
- జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పాత వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న ఆర్థిక శాఖ
- అత్యధికంగా సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2 శాతం వడ్డీ రేటు
- చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్ల సవరణ
సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్‌పై 4 శాతం, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కం స్కీంపై 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ మూడు నెలలకు ఓసారి మారుస్తుంది.