టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
- ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రిగా బాధ్యతలు
- దీంతో ఆయన స్థానంలో పల్లా శ్రీనివాసరావును నియమించే యోచనలో చంద్రబాబు
- గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపు
ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై ఆయన ఏకంగా 95, 235 ఓట్లతో మెజారిటీతో గెలిచారు.
దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ధానంలో పల్లాకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కూడా చెబుతున్నారు. త్వరలో పల్లా శ్రీనివాసరావు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.