TDP: పార్టీ ప్రధాన కార్యాలయాన్ని లైటింగ్ తో డెకరేట్ చేసిన టీడీపీ... వీడియో ఇదిగో!

TDP decorates head office with lighting
షార్ట్స్‌లో చూడండి
మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, టీడీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. సాధారణ కార్యకర్త నుంచి అధినేత చంద్రబాబు వరకు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ వర్గాలు సైతం ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు. ఫలితాలు వెల్లడి కాకముందే టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని లైటింగ్ తో డెకరేట్ చేయడం చూస్తుంటే, గెలుపుపై ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
Go Back to Shorts
TDP
Central Office
Lighting
Mangalagiri
Andhra Pradesh

More Telugu News