విమర్శలతో వెనక్కి తగ్గిన జువైనల్ కోర్టు.. పూణె బాలుడి బెయిలు రద్దు
- జూన్ 5 వరకు బాలుడికి రిమాండ్
- అతడి తండ్రికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
- బాలుడి తాతకు చోటా రాజన్‌తో సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం
- నిబంధనలు అతిక్రమించిన రెండు పబ్‌లపై కఠిన చర్యలు
మరోవైపు, నిందితుడైన బాలుడి తాత సురేంద్రకుమార్ అగర్వాల్‌కు అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌తో సంబంధాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకోవైపు, నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండు పబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత ఇతర పబ్‌ల పనిపట్టాలని పోలీసులు నిర్ణయించారు. బాలుడి నేరం అతిపెద్దది కావడంతో అతడిని మేజర్‌గా పరిగణించాలంటూ పూణె పోలీసులు కోర్టులో రివ్యూ దాఖలు చేశారు.