నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు బాబాయ్: జూనియర్ ఎన్టీఆర్ కు మంచు మనోజ్ గ్రీటింగ్స్
- 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న తారక్
- ఈరోజు మంచు మనోజ్ 41వ పుట్టినరోజు కూడా
- తారక్ పై తన ఆత్మీయతను చాటుకున్న మనోజ్
'తారక్ 'దేవర' సినిమా నుంచి నిన్న సాంగ్ విడులయింది. అదిరిపోయింది. ఆల్ ది వెరీ బెస్ట్ బాబాయ్' అని అన్నారు. మరోవైపు, ఈరోజు మంచు మనోజ్ 41వ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన బర్త్ డేను పురస్కరించుకుని 'భక్త కన్నప్ప' టీమ్ కూడా టీజర్ ను లాంచ్ చేస్తున్నారని తెలిపారు. తన అన్న విష్ణుకు, టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఈరోజేనని... ఆయనను చాలా మిస్ అవుతున్నామని అన్నారు. ఆయనెక్కడున్నా ఆయన చల్లని దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తను, తన కుటుంబానికి... మీకు, మీ కుటుంబాలకు... అందరికీ ఆ శివుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.