టీడీపీ కార్యకర్త చెవి కోసేసిన వైసీపీ నేత

టీడీపీ కార్యకర్త చెవి కోసేసిన వైసీపీ నేత

YSRCP leader cuts ear of TDP follower
  • ఇటీవలే టీడీపీలో చేరిన తిమోతి
  • ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని చుట్టుపక్కల వారికి వివరించిన తిమోతి
  • తిమోతిపై కొడవలితో దాడి చేసిన స్థానిక వైసీపీ నేత
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేశాడు. బాధితులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు... పందువ గ్రామానికి చెందిన తిమోతి ఇటీవలే వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విషయాలను వివరించాడు. ఈ నేపథ్యంలో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
TDP Follower
Attack

More Telugu News