cat: కుక్క, పిల్లి, కోతి క్యూట్ ఫ్రెండ్​ షిప్! వీడియో వైరల్

  • జాతి వైరం మరచిన జంతువులు
  • పక్కపక్కనే కూర్చొని సేదతీరిన వైనం
  • నెటిజన్ల ఫిదా.. ఆ జంతువుల మనసులు కలిశాయంటూ కామెంట్
Viral Video This Cute Friendship Among Cat Dog and Monkey Will Melt Your Heart

సాధారణంగా పిల్లి కనిపిస్తే చాలు కుక్క వెంటపడి తరుముతుంది. దాన్ని చంపాలని చూస్తుంది. అలాగే కోతికి, కుక్కకు పడదు. కుక్కను కోతి తెగ ఆటపట్టిస్తుంది. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ 43 సెకన్ల వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. జాతి వైరం మరచి కుక్క, పిల్లి, కోతి స్నేహంగా మెలగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆ వీడియోలో కుక్క, పిల్లి, కోతి పక్కపక్కన కూర్చున్నాయి. కుక్క ముందటి కాళ్ల మధ్యన పిల్లి ముడుచుకొని కూర్చోగా ఆ రెండింటినీ ఆనుకొని కోతి కూర్చుంది. అలసిపోయినట్లు కనిపించిన కుక్క, పిల్లి కునుకు తీసేందుకు ప్రయత్నిస్తుంటే కోతి తన పేరుకు తగ్గట్లుగానే ప్రవర్తించింది. కుక్క నోట్లో వేలు పెట్టి దాన్ని చికాకు పరిచింది. అలాగే దాన్ని ముద్దాడింది. ఆ తర్వాత తన తల గోక్కొని పేలను నోట్లో వేసుకోవడం వీడియోలో కనిపించింది.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో ఈ వీడియో పోస్ట్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే దీనికి 11 లక్షల వ్యూస్ లభించాయి. దీన్ని చూసిన నెటిజన్లంతా రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ఆ భౌతిక తేడాలను అధిగమించి ఆ జంతువుల మనసులు కలిశాయంటూ ఓ యూజర్ అభిప్రాయపడగా.. ఇదో హ్యాపీ ఫ్యామిలీ అంటూ మరొకరు కామెంట్ చేశారు. సమాజంలో ప్రజలంతా కుల, మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవించాలనే సందేశాన్ని ఈ వీడియో చాటిచెబుతోందని మరొకరు పోస్ట్ చేశారు.


  • Loading...

More Telugu News