సరిపోయారు.. ఇద్దరూను.. ట్యాబ్​కు అతుక్కుపోయిన పాప, బుల్​ డాగ్​.. వైరల్​ వీడియో ఇదిగో!

girl and her pet dog glued to screen viral video
  • చిన్నారి ఫోన్ వదిలేసి, ఆడుకుంటుందని కుక్కపిల్లను తెచ్చిన తల్లిదండ్రులు
  • కానీ ఇద్దరూ కలిసి మరీ ఫోన్‌కు అతుక్కుపోయిన తీరు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
తమ పాప ఎప్పుడు చూసినా ఫోన్ కు అతుక్కుపోతోందని భావించిన తల్లిదండ్రులు.. ఆమెకు తోడుగా ఉంటుందని ఓ అందమైన బుల్ డాగ్ ను తెచ్చారు. పాప దానితో ఆడుకుంటుందని, ఫోన్ ను పక్కన పెడుతుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. 

ఇద్దరూ కలసి ఫోన్ లోనే..
పాప మాత్రమే కాదు.. ఆమెకు తోడుగా ఉంటుందని తెచ్చిన కుక్కపిల్ల కూడా ఫోన్ కు అడిక్ట్ అయిపోయింది. ఇద్దరూ కలసి ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోయి.. ఫోన్ లోనే తల పెట్టేస్తున్నారు. ఓ రోజు ఒకరికి పోటీగా మరొకరు ఫోన్ కు అతుక్కుపోవడాన్ని చూసిన తల్లిదండ్రులు వీడియో తీసి నెట్ లో పెట్టారు. ‘ఎక్స్’లో ఓ యూజర్ దీనిని పోస్ట్ చేశారు.
  • ‘తల్లిదండ్రులు ఆమె కోసం ఓ కుక్కపిల్లను తెచ్చారు. ఆమె ఫోన్ ను వదిలేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఇదీ..’ అని క్యాప్షన్ పెట్టారు.
  • రెండు రోజుల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఏకంగా 26 లక్షల వ్యూస్ వచ్చాయి. లక్షా 20 వేల వరకు లైకులు కూడా వచ్చాయి.
  • ఫోన్ అంటే అంతే.. మనుషులైనా, కుక్కపిల్లలైనా అడిక్ట్ కావాల్సిందే అంటూ సరదాగా కామెంట్లు వస్తున్నాయి.
Go Back to Shorts
Dog
offbeat
Viral Videos
Twitter

More Telugu News