అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం రేవంత్ రెడ్డి
- అమిత్ షా ఫేక్ వీడియోతో తనకు సంబంధం లేదన్న రేవంత్ రెడ్డి
- తాను తెలంగాణ సీఎంవో, వ్యక్తిగత ఖాతాను మాత్రమే వినియోగిస్తున్నానని వెల్లడి
- తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని స్పష్టీకరణ
రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడని మాటలకు సంబంధించిన ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఫేక్ వీడియోపై ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలోనూ బీజేపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోనూ కేసు నమోదయింది. దీంతో మే 1వ తేదీలోగా ఈ ఫేక్ వీడియోపై సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం పంపించారు.