యాంకర్ లాస్య ఇంట విషాదం

Anchor Lasya father in law passes away
  • లాస్య భర్త మంజునాథ్ తండ్రి మృతి
  • తండ్రి మరణాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడించిన మంజునాథ్
  • 2017లో ప్రేమ వివాహం చేసుకున్న లాస్య, మంజునాథ్
ప్రముఖ యాంకర్ లాస్య ఇంట విషాదం నెలకొంది. ఆమె మామ (భర్త మంజునాథ్ తండ్రి) మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మీరు భౌతికంగా ఇక్కడ లేకపోయినా... మీ ఆత్మ ఎప్పుడూ తమతోనే ఉంటుందని ఆయన ఇన్స్టాలో తెలిపారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. మిస్ యూ నాన్న అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. అయితే, తన తండ్రి మరణానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 

2017లో లాస్య, మంజునాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. యాంకర్ గా లాస్యకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న లాస్య... బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు ఆమె మామ వృతి పట్ల అభిమానులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇలాంటి విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సోషట్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.
Advertisement
Anchor Lasya
Father in law
Tollywood

More Telugu News