మేం ఆడవాళ్లం కూడా తాగుతాం.. నేను మద్యంతో సహజీవనం చేశా: పూజాభట్
- ఏడున్నరేళ్ల పాటు మద్యంతో సహజీవనం చేశానన్న పూజాభట్
- తనను తాగుబోతు అని పిలిచేవారని వ్యాఖ్య
- ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ఓ పోరాటం చేశానని వెల్లడి
తాను మందుకు బానిస అయిన సమయంలో ఓ టైమ్ లో అందరూ తనను తాగుబోతు అని పిలిచేవారని పూజాభట్ చెప్పారు. మద్యం అలవాటు నుంచి పూర్తిగా బయట పడాలని అనుకున్నానని.... అయితే ఆ వ్యసనం నుంచి బయట పడటం అంత ఈజీగా జరగలేదని అన్నారు. మద్యం అలవాటును మానేయడానికి తాను నిజంగానే ఓ పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి మహిళలు భయపడతారని... ఈ సమస్య అందరికీ ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా మహిళలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడాలని చెప్పారు.