విజయ్ దేవరకొండతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీమ్

Prashant Neel team gives clarity on film with Vijay Devarakonda
  • ఇటీవల విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ప్రశాంత్ నీల్
  • ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ ప్రచారం
  • ఆ వార్తల్లో నిజంలేదని చెప్పిన ప్రశాంత్ నీల్
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ కు ప్రశాంత్ నీల్ వచ్చారు. ఆ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. దీంతో సినిమా గురించి మాట్లాడేందుకే విజయ్ ఇంటికి నీల్ వెళ్లారని... ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే ప్రచారం మొదలయింది. దీనిపై ప్రశాంత్ నీల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఇదంతా అసత్య ప్రచారమేనని చెప్పింది. 

మరోవైపు విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'ఫ్యామిలీ మేన్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ తో కూడా విజయ్ గతంలో ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు.
Go Back to Shorts
Vijay Devarakonda
Prashanth Neel
Tollywood

More Telugu News