కాసేపట్లో పవన్ నామినేషన్.. కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Pawan Kalyan to file nomination today
  • పిఠాపురంలో నామినేషన్ వేస్తున్న పవన్ కల్యాణ్
  • చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీ
  • ఇప్పటికే వేల సంఖ్యలో చేరుకున్న కూటమి నేతలు, కార్యకర్తలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. నామినేషన్ వేయడానికి ఆయన భారీ ర్యాలీగా బయల్దేరారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి ఆయన ర్యాలీ ప్రారంభమయింది. పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకూ ర్యాలీగా వెళతారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ తో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేస్తారు. 

పవన్ ర్యాలీలో పాల్గొనేందుకు జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. మరోవైపు తన విజయం కోసం ఒంటి పూట భోజనంతో నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ ప్రచారం చేస్తున్న వీరాభిమాని మామిడి బాబ్జీని పవన్ అభినందించారు. బాబ్జీ సైకిల్ ను తాను కూడా తొక్కి కూటమి శ్రేణులను ఉల్లాసపరిచారు. 

Advertisement
Pawan Kalyan
Janasena
Nomination
Pithapuram

More Telugu News