పారిస్ ఒలింపిక్స్ కు ముందు ప్రకంపనలు సృష్టిస్తున్న స్వీడన్ పోల్ వాల్టర్... మరోసారి వరల్డ్ రికార్డు బద్దలు
- చైనాలోని ఝియామెన్ లో డైమండ్ లీగ్ అథ్లెటిక్ పోటీలు
- పోల్ వాల్ట్ క్రీడాంశంలో 6.24 మీటర్లతో అర్మాండ్ డుప్లాంటిస్ వరల్డ్ రికార్డు
- గతంలో తన పేరిట ఉన్న 6.23 మీటర్ల రికార్డును తిరగరాసిన స్వీడన్ అథ్లెట్
- ఇప్పటివరకు ఎనిమిదిసార్లు వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన డుప్లాంటిస్
గత సెప్టెంబరులో యూజీన్ లో జరిగిన డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీల్లో తన పేరిట ఉన్న 6.23 మీటర్ల వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ నేడు సవరించాడు. తద్వారా, ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ కు ముందు ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు.
24 ఏళ్ల డుప్లాంటిస్ కు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.