Chandrababu: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత.. వీడియో ఇదిగో!

Chandrababu B Forms to candidates
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం బీ ఫారాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు. టీడీపీ శ్రేణులు, ఏపీ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ కేండిడేట్లను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Go Back to Shorts
Chandrababu
TDP Candidates
Amaravati
TDP Office
B Forms
AP Assembly Polls
AP Politics

More Telugu News