కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేడు మౌనదీక్ష.. భట్టికి కొంచెం కూడా కృతజ్ఞత లేదంటూ నిప్పులు

Congress Senior Leader VH Silence Protest Today
  • వీహెచ్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • సైబర్ క్రైం పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు
  • వారిపై చర్యలు తీసుకోవాలంటూ నేటి మధ్యాహ్నం 3 గంటలకు మౌనదీక్ష
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నేడు మౌనదీక్ష చేపట్టనున్నారు. అంబర్‌పేటలోని తన నివాసంలో మధ్యాహ్నం మూడు గంటలకు దీక్షకు దిగనున్నారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు కొందరు సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా వీహెచ్ మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, అయినప్పటికీ ఆయనకు కృతజ్ఞత లేదని మండిపడ్డారు. తనకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వీహెచ్‌కు ఆశాభంగం ఎదురైంది. దీంతో ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన మూడు స్థానాల్లో ఖమ్మం కూడా ఒకటి. నేడో, రేపో ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఖమ్మం టికెట్‌ పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
V Hanumantha Rao
Congress
Telangana
Mallu Bhatti Vikramarka

More Telugu News