జీమ్‌లో హీరోయిన్‌ వ‌ర్కౌట్‌.. నెట్టింట ఫ‌న్నీ వీడియో వైర‌ల్‌!
Add ap7am to your home Screen

జీమ్‌లో హీరోయిన్‌ వ‌ర్కౌట్‌.. నెట్టింట ఫ‌న్నీ వీడియో వైర‌ల్‌!

Herione Mrunal Thakur shares Funny Gym Video goes Viral
  • ఇన్‌స్టాలో ఫ‌న్నీ వీడియో షేర్ చేసిన 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్
  • జీమ్ ట్రైన‌ర్‌తో కామెడీ చేసిన బాలీవుడ్ భామ‌
  • వీడియో చూసి త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న నెటిజ‌న్లు
'సీతారామం' చిత్రంలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌.. ఈ ఒక్క సినిమాతో తెలుగులో రాత్రికి రాత్రే క్రేజీ కథానాయిక‌గా మారిపోయింది. త‌న‌దైన న‌ట‌న‌, అభిన‌యం, అందంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆమె క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత రెండో సినిమాలో నేచుర‌ల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న‌'లో జ‌త‌క‌ట్టింది. ఈ మూవీ కూడా హిట్ కావ‌డంతో మృణాల్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'ఫ్యామిలీ స్టార్‌'లో న‌టించింది. ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఆమె.. ఫిట్‌నెస్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. 

దానికోసం మృణాల్ ఠాకూర్ క్ర‌మం త‌ప్ప‌కుండా జీమ్‌కి వెళ్తుంది. అప్పుడ‌ప్పుడు జీమ్‌లోని వ‌ర్కౌట్ల తాలూకు ఫొటోలు, వీడియోల‌ను ఆమె అభిమానుల‌తో పంచుకుంటుంది కూడా. ఇదే కోవ‌లో తాజాగా మృణాల్ జిమ్ వ‌ర్కౌట్ వీడియో ఒక‌టి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ట్రైన‌ర్‌తో కామెడీ చేయ‌డం మ‌నం చూడొచ్చు. 

ఈ వీడియోలో ట్రైన‌ర్ కెమెరాను ఆమెవైపు చూపిన‌ప్పుడ‌ల్లా వెంట‌నే వ్యాయామం చేయ‌డం ప్రారంభిస్తుంది. ట్రైన‌ర్ చూడ‌ని స‌మ‌యంలో వ‌ర్కౌట్స్ ఆపేసి డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మ‌ళ్లీ అత‌డు చూడ‌గానే క‌ష్ట‌ప‌డి వ‌ర్కౌట్ చేస్తున్న‌ట్లు న‌టించ‌డాన్ని ఈ వీడియోలో గ‌మ‌నించవ‌చ్చు. ఇప్పుడీ ఫ‌న్నీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.
Advertisement
Mrunal Thakur
Funny Gym Video
Bollywood
Tollywood

More Telugu News