రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!
- సాయంత్రం కేరళ నుంచి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్
- వయనాడ్ లో రాహుల్ తరపున రేవంత్ ప్రచారం
- రేపు వంశీచంద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
21న భువనగిరిలో చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొంటారు. 22 ఉదయం ఆదిలాబాద్ సభ, 23న నాగర్ కర్నూల్ లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 24 ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. మరోవైపు కేరళ పర్యటనలో వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి మద్దతుగా రేవంత్ ప్రచారాన్ని నిర్వహించారు. కాబోయే ప్రధాని రాహుల్ అని రేవంత్ జోస్యం చెప్పారు.