మరికాసేపట్లో అయోధ్య రాముడికి సూర్య తిలకం
- రామ మందిరంలో అద్భుతం
- మధ్యాహ్నం 12:15 నిమిషాలకు బాల రాముడి నుదుటిని ముద్దాడనున్న సూర్యుడు
- నాలుగు నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేయనున్న దృశ్యం
సూర్యతిలకం ఎలా ఏర్పడుతుందంటే..
మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న రామ మందిరంలో ఇప్పటికే మొదటి అంతస్తు పూర్తయిన విషయం తెలిసిందే. మరో రెండు అంతస్తులు నిర్మాణం కొనసాగుతోంది. సూర్య తిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను అమర్చారు. సూర్య కిరణాలు అందులో పడి రెండో అంతస్తులోకి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గర్భగుడిలోని బాలక్ రామ్ విగ్రహం నుదుటిపై ప్రకాశిస్తాయి. సూర్యుడి గమనాన్ని, కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి రోజు మాత్రమే ఈ అద్భుతం చోటుచేసుకోనుంది.