ఆరోగ్యంగానే ఉన్నా.. మళ్లీ వచ్చి ఎంటర్‌టైన్ చేస్తా: సాయాజీ షిండే
- చాతీనొప్పితో ఈ నెల 11న ఆసుపత్రిలో చేరిన సాయాజీ షిండే
- గుండెలో కుడివైపున 99 శాతం బ్లాక్స్ గుర్తించి యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు
- త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ఆకాంక్ష
చాతీనొప్పితో బాధపడుతూ ఈ నెల 11న సాయాజీ షిండే మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో కుడివైపున 99 శాతం బ్లాక్స్ గుర్తించి వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సాయాజీ షిండే అతడు, పోకిరి సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యారు.