స్టాలిన్ కోసం రోడ్డు దాటి వెళ్లి స్వీట్స్ కొన్న రాహుల్.. వీడియో షేర్ చేసిన రేవంత్
Advertisement

స్టాలిన్ కోసం రోడ్డు దాటి వెళ్లి స్వీట్స్ కొన్న రాహుల్.. వీడియో షేర్ చేసిన రేవంత్

Rahul Gandhi purchased sweets for Stalin
  • చెన్నై పర్యటనలో ఉన్న రాహుల్
  • రోడ్డు డివైడర్ ను దాటుకుని వెళ్లిన వైనం
  • ప్రేమ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని నమ్మే నాయకుడని రేవంత్ కితాబు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రోడ్డు ఇటువైపు నుంచి డివైడర్ దాటుకుని అవతలికి వెళ్లిన రాహుల్ ఓ స్వీట్ షాపులోకి వెళ్లారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఇచ్చేందుకు స్వీట్లు కొన్నారు. ఈ వీడియోను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఒకనాడు ఇదే గడ్డపై తండ్రిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. ప్రేమ మాత్రమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని నమ్మే ఒక బలమైన నాయకుడు అని రేవంత్ అన్నారు. దీనికి చిన్ని ఉదాహరణే ఈ సన్నివేశం అని చెప్పారు. 

Advertisement
Rahul Gandhi
Revanth Reddy
Congress
Stalin
DMK

More Telugu News