ఫుడ్ బిజినెస్‌లోకి రకుల్ ప్రీత్‌సింగ్.. 16న మాదాపూర్‌లో ‘ఆరంభం’ ప్రారంభం.. ప్రత్యేకత ఇదేనట!
- ఇప్పటికే పలు వ్యాపారాల్లో రకుల్‌ప్రీత్ సింగ్
- కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’తో కలిసి రెస్టారెంట్
- మిల్లెట్స్‌తో వంటకాలు
- ‘ఆరంభం’లో ఫుడ్ మనసుకు కూడానట!
‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ నెల 16న ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారు. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’ కొలాబరేషన్‌తో దీనిని ప్రారంభిస్తున్నారు. ఇందులో తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు లభిస్తాయి. ఫుడ్‌బిజినెస్‌లో కాలుమోపుతుండడంపై రకుల్ సంతోషం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అందరికీ న్యూట్రిషన్ అందించాలన్నదే ఈ రెస్టారెంట్ లక్ష్యమని తెలిపారు. ‘ఆరంభం’లో ఫుడ్ శరీరానికి మాత్రమే కాదని, ఆత్మ(మనసు)కు కూడా అని అభివర్ణించారు.