నేడు అనకాపల్లిలో పవన్ వారాహి యాత్ర
- మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లికి పవన్
- ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెహ్రూచౌక్ జంక్షన్ వరకు రోడ్ షో
- నెహ్రూ కూడలిలో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగం
నాలుగు గంటలకు నెహ్రూచౌక్ కూడలిలో వారాహి వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు. రేపు (సోమవారం) యలమంచిలిలో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు.