ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు... : జడ్సన్ రాయని పద్యం అంటూ బాల్క సుమన్ తీవ్ర విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు... : జడ్సన్ రాయని పద్యం అంటూ బాల్క సుమన్ తీవ్ర విమర్శలు

Balka Suman tweets after jadson suspended from congress
  • దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు... మీలో మీరే అమ్మనక్కని బూతులు తిట్టుకోండన్న బాల్క సుమన్
  • మీ దోపిడీకి బలైపోతున్న సమాజంలో నిలబడి కొడవళ్లు ఎత్తిన ప్రతీసారి కొవ్వొత్తులై కరుగుతూనే ఉన్నామని వ్యాఖ్య
  • 'అకారణంగా ఓ అశక్తుణ్ణి హింసించిన వాడెవడూ సుఖపడబోడని' భారతం ఏనాడో చెప్పిందని పేర్కొన్న సుమన్
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినందుకు గాను ఆ పార్టీ బక్క జడ్సన్‌పై వేటు వేసింది. ఆ పార్టీ నుంచి జడ్సన్‌ను సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ 'జడ్సన్ రాయని పద్యం' అంటూ కాంగ్రెస్‌పై ఓ పద్యరూపంలో విమర్శనాత్మక ట్వీట్ చేశారు. 

'ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు... 
మనుషులను లేకుండా చేసి జీవచ్ఛవాలుగా మారి...
మీరే ఏలండి

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు 
మీలో మీరే అమ్మనక్కని బూతులు తిట్టుకోండి
మీరే తన్నుకోండి 
కాంగ్రెస్ ను మీరే పంచుకోండి

మీ మలినాన్ని మోస్తున్నందుకు మేము వేల ఏండ్లనుంచే ఊరవతల విసిరేయబడ్డోల్లం
బహిష్కరణ మాకు కొత్తగాదురా..

మీ దోపిడీకి బలైపోతున్న సమాజంలో నిలబడి కొడవళ్లు ఎత్తిన ప్రతీసారి కొవ్వొత్తులై కరుగుతానే ఉన్నాం..

మమ్మల్ని మేము విముక్తం చేసుకునే ప్రతి సందర్భంలో వివక్షను ఎదుర్కుంటూనే వున్నాం..

ఏ బహుజనుల త్యాగాల మీద 
ఏ దళితుల ప్రాణాల పునాదుల మీద 
నా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదో 
దాని మూలాలను పెకిలిస్తున్న మీకు మాదిగ బిడ్డ ఉసురు తప్పకుండా తగులుతుంది..
కాళ్లుండి వంకర నడక నడుస్తున్న మిమ్మల్ని సక్కగ జేయాల్నని చూసిన ఓ నాలాంటి వాణ్ణి బయటకు గెంటేయాల్నని చూసిన మీ దుర్మార్గం బద్దలుకాక తప్పదు..
'అకారణంగా ఓ అశక్తుణ్ణి హింసించిన వాడెవడూ సుఖపడబోడని' భారతం ఏనాడో చెప్పింది మీకు ఆ గతి తప్పదు..

ఒక్క బక్కోడైన బక్క జడ్సన్‌ను మీరు బహిష్కరించినమని సంబుర పడుతుర్రేమో..
మీరు గెంటివేసింది ముక్కోటి తెలంగాణ బహుజన ఆత్మలను
మీరు బహిష్కరించింది మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండ వర్గాల తన్లాటను

రూమీ టోపీ నుంచి గాంధీ టోపీ దాకా ఆనుంచి ఏ ఎండకాగొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం 
కూచున్న కొమ్మనే నరికేసుకునే దుర్మార్గానికి తెగబడ్డది..

బాయిల బడ్డ కుక్క తీయబోయిన కరుస్ధది... అట్లున్నది మీ అభద్రత...
మీ కబంధ హస్తాల్లో చిక్కిన కాంగ్రెస్‌ను ఎవ్వడూ కాపాడలేడిప్పుడూ

స్వాతంత్రాన్ని తెచ్చి జాతిని విముక్తం చేసిన మూడురంగుల జెండాను నేడు ఒక తెలంగాణ భూస్వామ్య సామాజికవర్గం చెరబట్టింది
నాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన చేతులే నేడు అన్యాయమని ఎలుగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి.
మూల్యం చెల్లించుకుంటాయి..' అని బాల్క సుమన్ పద్య రూపంలో ట్వీట్ చేశారు.
Advertisement
Balka Suman
BRS
Congress

More Telugu News