గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి.. వైర‌ల్ వీడియో!
Advertisement

గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి.. వైర‌ల్ వీడియో!

Thief Hand Stuck in Temple Hundi in Kamareddy
  • కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఘ‌ట‌న
  • సురేశ్ అనే వ్య‌క్తి ఇలా హుండీ దొంగ‌త‌నానికి ప్ర‌య‌త్నించి ఇరుక్కుపోయిన వైనం
  • ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకు సమాచారం 
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్  
గుడిలో చోరీకి ప్ర‌య‌త్నించిన ఓ వ్య‌క్తి త‌న చెయ్యి హుండీలో ఇరుక్కుపోవ‌డంతో అడ్డంగా దొరికిపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండీ దొంగ‌త‌నానికి ప్ర‌య‌త్నించాడు. దీనికోసం హుండీపై భాగాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న న‌గ‌దును తీసేందుకు లోపల చెయ్యి పెట్టాడు. 

అంతే..  అత‌ని చెయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్ర‌య‌త్నించినా బ‌య‌ట‌కు రాలేదు. దాంతో త‌ప్పించుకునే మార్గంలేక అక్క‌డే ఉండిపోయాడు. ఇక‌ ఉదయం గుడికి వచ్చిన భక్తులు అతనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.
Advertisement
Thief
Temple
Kamareddy District
Telangana
Viral Videos

More Telugu News