చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాను: హీరోయిన్ సురభి
- విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రమాదం అంచున నిలిచామన్న నటి
- విమానం నియంత్రణ తప్పడంతో భయమేసిందని వెల్లడి
- పైలెట్ తెలివైన నిర్ణయంతో అంతా బతికిపోయామన్న సురభి
చావు అంచుల దాకా వెళ్లొచ్చాననే భావన కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తోందని అన్నారు. తాను ఈ రోజు ఇలా బతికుండడంతో తనలోని సానుకూల దృక్పథం పట్ల మరింత నమ్మకం కలిగిందని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఏ విమానం, ఎక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో జరిగిందనే విషయాలను హీరోయిన్ సురభి వెల్లడించలేదు.
కాగా హీరోయిన్ సురభి ‘బీరువా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్లతో పాటు పలు సినిమాల్లో నటించారు.