తెలంగాణలో వడగండ్ల వానలు.. ఐదు రోజుల పాటు వర్ష సూచన
- రేపు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
- బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని... హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.