నేడు టీడీపీ రెండో జాబితా విడుదల.. చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ!
- తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
- రెండో జాబితాలో 25 మందిని ప్రకటించే అవకాశం
- చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు చెప్పిన చంద్రబాబు
మరోవైపు, రెండో జాబితా విడుదల నేపథ్యంలో, చంద్రబాబును మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న సాయంత్రం కలిశారు. ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గంటాకు చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిన్న మరోసారి చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. టికెట్ ఆశిస్తున్న పలువురు కడప జిల్లా నేతలు కూడా చంద్రబాబును కలిశారు. వీరిలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జీలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భూపేశ్ రెడ్డి, బద్వేల్ నేత రితీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి పి.నారాయణ కూడా చంద్రబాబును కలిశారు. అయితే, తొలి జాబితాలోనే నారాయణ పేరును చంద్రబాబు ప్రకటించారు.